రూ. 10 లక్షల కోట్ల అప్పులో ఏ జిల్లాకి ఎంత ఖర్చు పెట్టారో జగన్ చెప్పాలి: చింతా మోహన్ - Chinta Mohan on YS Jagan - CHINTA MOHAN ON YS JAGAN
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 16, 2024, 3:51 PM IST
Former Union Minister Chinta Mohan on the YS Jagan: జగన్ పరిపాలన కంటే చంద్రబాబు పరిపాలన బాగుందని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ చెప్పారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబుని అభినందిస్తున్నానని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ని రెండు కుటుంబాలు విభజించాయని, తెలంగాణలో ఒక కుటుంబం, ఆంధ్రప్రదేశ్‌లో మరో కుటుంబం పదేళ్ల పాటూ పాలించి వేల కోట్లు దోచుకున్నాయని అన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్, వైఎస్ జగన్‌పై చింతా మోహన్ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఈ రెండు కుటుంబాల వల్ల రెండు రాష్ట్రాలు దిల్లీలో అప్పులు అడుక్కోవాల్సిన దుస్థితి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ అప్పుల ప్రదేశ్‌గా మారిపోయిందని జగన్ చేసిన 10 లక్షల కోట్ల అప్పులో ఏ జిల్లాకి ఎంత ఖర్చు పెట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు. దేశంలో దళితులకు అన్యాయం జరుగుతుందని, బీజేపీతో పాటూ కొన్ని ప్రాంతీయ పార్టీలు కలిసి దళితుల్ని విభజించి పాలించాలని చూస్తున్నాయని మాజీ మంత్రి చింతా మోహన్ ఆరోపించారు.