కూటమి గెలిస్తే ముస్లింల 4శాతం రిజర్వేషన్లు కొనసాగుతాయి: మాజీ ఎమ్మెల్సీ ఇక్బాల్ - MUSLIMS RESERVATIONS - MUSLIMS RESERVATIONS

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 8, 2024, 4:02 PM IST

Former MLC Iqbal on Muslims Reservations: కూటమి అధికారంలోకి వస్తే ముస్లింల 4 శాతం రిజర్వేషన్లు కొనసాగుతాయని మాజీ ఎమ్మెల్సీ ఇక్బాల్ స్పష్టం చేశారు. వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు తెలుగుదేశం కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన సీఎం జగన్ ఈ ఐదేళ్లల్లో రిజర్వేష్ల పై ఏ రోజైన కోర్టుకు వెళ్లారా అని ప్రశ్నించారు. కూటమి అధికారంలోకి వస్తేనే ముస్లిం మైనార్టీలకు న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. అందర్నీ కలుపుకొని రాష్ట్ర అభ్యున్నతే కూటమి ఎజెండా అని తెలిపారు. ఈ నేపథ్యంలో ముస్లిం మైనార్టీలందరూ కూటమి గెలుపునకు కృషి చేయాలని ఇక్బాల్ పిలుపునిచ్చారు. 

"కూటమి గెలిస్తే ముస్లింల 4శాతం రిజర్వేషన్లు కొనసాగుతాయి. రిజర్వేషన్లపై సీఎం జగన్‌ ఐదేళ్లల్లో ఏ రోజు అయిన కోర్టుకు వెళ్లారా? ముస్లిం మైనార్టీలందరూ కూటమి గెలుపునకు కృషి చేయాలి. ఎన్‌ఆర్‌సీ అనేది ఉండదు. అందర్నీ కలుపుకుని రాష్ట్ర అభ్యున్నతే కూటమి ఎజెండా." - షేక్ మహమ్మద్ ఇక్బాల్, మాజీ ఎమ్మెల్సీ 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.