అవినీతి ఆరోపణలపై చర్చకు సిద్ధమా? - ఎమ్మెల్యేకు మాజీ ఎమ్మెల్యే సవాల్ - MLA Vs EX MLA in Anaparthi
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 23, 2024, 11:20 AM IST
Former MLA Ramakrishna Reddy Challenge to MLA Suryanarayana Reddy: తూర్పు గోదావరి జిల్లా అనపర్తి ఎమ్మెల్యే సూర్య నారాయణరెడ్డిపై తాను చేసిన అవినీతి ఆరోపణలపై బహిరంగ చర్చకు సిద్ధమంటూ తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే (Former MLA) రామకృష్ణా రెడ్డి లేఖలను పంపిణీ చేశారు. దేవీచౌక్ సెంటర్ నుంచి రైల్వేస్టేషన్ వరకు ప్రజలకు పంపిణీ చేశారు. ఆసుపత్రి సిబ్బందికీ లేఖలను అందజేసి ఎమ్మెల్యేకు ఇవ్వాలని కోరారు. అనంతరం ఆసుపత్రి వద్ద టీడీపీకి అనుకూలంగా నినాదాలు చేశారు. ఎమ్మెల్యే చేసిన అవినీతిని ఆధారాలతో నిరూపిస్తానని, తనపై చేసిన ఆరోపణలపై ఎమ్మెల్యే బహిరంగ చర్చకు రావాలని మాజీ ఎమ్మెల్యే రామకృష్ణా రెడ్డి సవాల్ విసిరారు.
ధాన్యం కొనుగోల్లో బస్తాపై రూ. 10 తీసుకున్నానని, మద్యం దుకాణాల వద్ద డబ్బులు వసూలు చేశానని, చెరువుల్లో మట్టి తవ్వుకున్నానని ఎమ్మెల్యే తనపై ఆరోపణలు చేశారని రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. వీటిపై జరిగిన విజిలెన్స్ ఎంక్వయిరీలు ఏమైపోయాయని, ఆ నివేదికలు బయటపెట్టాలన్నారు. తప్పు రుజువైతే శిక్షకు సిద్ధమని, ఎమ్మెల్యే చేసిన అవినీతిని ఆధారాలతో నిరూపిస్తానని, తాను చేసిన ఆరోపణలపై ఎమ్మెల్యే బహిరంగ చర్చకు రావాలని మాజీ ఎమ్మెల్యే రామకృష్ణా రెడ్డి సవాలు విసిరారు.