బీఆర్ఎస్ ప్రభుత్వం, తమకు ప్రజలకు మధ్య గ్యాప్ సృష్టించింది : తమిళిసై సౌందరరాజన్ - lok sabha elections 2024 - LOK SABHA ELECTIONS 2024
🎬 Watch Now: Feature Video
Published : May 4, 2024, 5:40 PM IST
Ex Governor Tamilisai comments on BRS : తాను రాష్ట్ర గవర్నర్‌గా ఉన్న సమయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం, తమకు ప్రజలకు మధ్య గ్యాప్‌ని సృష్టించిందని మాజీ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ పేర్కొన్నారు. సంగారెడ్డిలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో నిర్విహించిన విశిష్ట సంపర్క్ అభియాన్ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తాము ఇప్పుడు సామన్య బీజేపీ కార్యకర్తనని, తమను ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం లేదన్నారు.
ఆయుష్మాన్ భారత్ పథకం తెలంగాణలో ప్రవేశపెట్టడానికి తాను కృషి చేస్తే అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం సహకరించలేదని ఆరోపించారు. ఆయుష్మాన్ భారత్ పథకాన్ని తెలంగాణలో అమలు చేసి ప్రజలకు అందేలా చూడటమే తమ లక్ష్యమన్నారు. రాహుల్ గాంధీ ఎప్పుడు ఎక్కడ నుంచి పోటీ చేస్తాడో ఆయనకే తెలియకుండా పోయిందని వ్యాఖ్యానించారు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసిన బీజేపీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ప్రధానిగా మోదీ మూడోసారి ప్రమాణస్వీకారం చేయనున్నట్లు స్పష్టం చేశారు. కొన్ని పార్టీలు బీజేపీపై ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు.