అందుకోసమే వైసీపీ నేతను అరెస్టు చేశారా! ఎమ్మెల్యే ఆదేశాలతోనే జరిగిందంటున్నకుటుంబ సభ్యులు
🎬 Watch Now: Feature Video
Former Chairman of Vavveru Cooperative Bank Sura Srinivasulu Reddy was Arrested : నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో వవ్వేరు కో ఆపరేటివ్ బ్యాంకు మాజీ ఛైర్మన్ సూరా శ్రీనివాసులు రెడ్డి అరెస్టు కలకలం రేపుతోంది. నిబంధనలకు విరుద్ధంగా బార్‌లో మద్యం అమ్మకాలు చేస్తున్నారంటూ సూరాను నెల్లూరులోని ఆయన నివాసంలో అరెస్టు చేసి బుచ్చి స్టేషన్‌కు తరలించారు. బుచ్చి మండల వైసీపీలో కీలకంగా వ్యవహరించిన శ్రీనివాసులు రెడ్డి కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఆయన సతీమణి జడ్పీటీసీగా కొనసాగుతున్నారు.
సూరా తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుందని కోవూరు ఎమ్మెల్యే ఆదేశాలతోనే అక్రమంగా అరెస్టు చేశారంటూ కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. సూరా అరెస్టును నిరసిస్తూ బుచ్చిరెడ్డిపాలెం పోలీస్ స్టేషన్ వద్ద ఆయన అభిమానులు ఆందోళనకు దిగారు. ఈ కారణంగా అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. తమ నాయకుడిని తక్షణమే విడుదల చేయాలంటూ ఆయన అభిమానులు పట్టుబట్టడంతో వారికి పోలీసులకు మధ్య చాలా సేపు వాగ్వాదం జరిగింది. పోలీసులు నిరసనకారులను బలవంతంగా అక్కడి నుంచి పంపేశారు.