జగన్ చేసిన అప్పుల వివరాలను ప్రభుత్వం బహిర్గతం చేయాలి: కాంగ్రెస్ నేత చింతా మోహన్ - Chinta Mohan in Jagan - CHINTA MOHAN IN JAGAN
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 10, 2024, 3:00 PM IST
Former Central Minister Chinta Mohan Comments on YS Jagan : వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో జగన్ చేసిన అప్పులు, ఖర్చుల వివరాలను కూటమి ప్రభుత్వం బహిర్గతం చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత చింతా మోహన్ డిమాండ్ చేశారు. అభివృద్ధి పేరుతో జగన్ ప్రభుత్వం పది లక్షల కోట్ల రూపాయలకు పైగా అప్పులు చేసిందని కాంగ్రెస్ నేత ఆరోపించారు. చిత్తూరు జిల్లా కుప్పంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం నిధులను ఏఏ రంగాలకు ఖర్చు పెట్టారనే విషయాలపై తెలుగుదేశం ప్రభుత్వం ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ఉందని చింతా మోహన్ అన్నారు.
ఇప్పటివరకు పోలవరం ప్రాజెక్టుకు గత ప్రభుత్వాలు వెచ్చించిన నిధులను సైతం బహిరంగంగా తెలియజేయాలని చింతా మోహన్ పేర్కొన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో అమరావతిలోని సచివాలయం కళకళలాడుతుందని చెప్పారు. సచివాలయంలో ప్రజా ప్రతినిధులు, అధికారులతో పరిపాలన ఏ విధంగా ఉంటుందో తెలుస్తుందన్నారు. జర్నలిస్టులకు తిరుమలలో ఉచిత దర్శనం, వసతిని కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలన్నారు.