దుర్గమ్మ చెంతన కృష్ణమ్మ పరవళ్లు - ఆకట్టుకుంటోన్న నదీతీరం - Krishna River Flood Flow - KRISHNA RIVER FLOOD FLOW
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 7, 2024, 5:57 PM IST
Flood Water Release from Prakasam Barrage: కృష్ణమ్మ ప్రవాహం ఉద్దృతంగా కొనసాగుతోంది. ఎగువ నుంచి పరవళ్లు తొక్కుతూ దిగువకు ప్రవహిస్తోంది. శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల దాటుకుని దుర్గమ్మ చెంతకు చేరుకుంది. ప్రకాశం బ్యారేజ్ గేట్లు ఎత్తడంతో సముద్రుడిలో కలిసేందుకు దిగువకు బిరబిరా వెళ్తోంది. ప్రవాహం పెరిగే అవకాశం ఉండటంతో ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకుంటున్నారు. కనుచూపు మేర ప్రవాహంతో కృష్ణా నది అఖండంగా కనిపిస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది. కృష్ణమ్మ అందాలు తిలకించేందుకు పర్యాటకులు సైతం పెద్దఎత్తున నదీ తీరానికి చేరుకుంటున్నారు. విజయవాడలో కనక దుర్గమ్మ చెంతన కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుంది.
అత్యవసర సహాయం కోసం టోల్‌ఫ్రీ నంబర్లు: ప్రస్తుతం ఇన్‌ఫ్లో, ఔట్ ఫ్లో 1,01,767 క్యూసెక్కులు ఉందని అధికారులు పేర్కొన్నారు. దీంతో కృష్ణానది పరీవాహక వాసులు, లంకగ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వరద నీటిలో ఈతకెళ్లడం, చేపలు పట్టడం, నాటుపడవలో ప్రయాణించ వద్దని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. అత్యవసర సహాయం కోసం 1070, 112, 18004250101 టోల్‌ఫ్రీ నంబర్లును ఏర్పాటు చేసింది.