అధికార, విపక్ష నేతల మధ్య ఫ్లెక్సీల వివాదం - తీవ్ర వాగ్వాదం, తోపులాట - Koritepadu flexi dispute
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/26-01-2024/640-480-20595357-thumbnail-16x9-rurling-opposition-leaders.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 26, 2024, 2:22 PM IST
|Updated : Jan 26, 2024, 3:28 PM IST
Flexi Dispute Between Ruling and Opposition Leaders in Koritepadu : గుంటూరులోని కొరిటెపాడులో అధికార, విపక్ష నేతల మధ్య ఫ్లెక్సీల వివాదం ఉద్రిక్తతకు దారి తీసింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా 44వ డివిజన్ కొరిటెపాడు సెంటర్‌లో తెలుగుదేశం - జనసేన నాయకుల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే ఆ ఫ్లెక్సీలను వైసీపీ కార్యకర్తలు చించేసి ఆ స్థానంలో మంత్రి విడదల రజిని ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
Argument Moderated by Police Action : తెలుగుదేశం, జనసేన పార్టీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను అధికార కార్యకర్తలు చించేసిన విషయం తెలుసుకున్న విపక్ష నేతలు సంఘటన స్థలానికి చేరుకున్నారు. కోవెలమూడి రవీంద్ర, బోనబోయిన శ్రీనివాస్యాదవ్లతో పాటు పార్టీ కార్యకర్తలు ఆ విషయంపై ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో వైసీపీ, టీడీపీ, జనసేన నేతల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. పోలీసులు ఇరువర్గాల వారికి సర్ది చెప్పడంతో గొడవ సద్దుమణిగింది.