సముద్రంలో పైపులైన్ల వల్ల జీవనోపాధి కోల్పోతున్నాం- మత్స్యకారుల ఆందోళన ఉధృతం - Fishermen protest to fulfill demand

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 12, 2024, 12:53 PM IST

Fishermen Protest In Front Of Kakinada Collector Office: సముద్ర తీరంలో వేసిన పైపులైన్లను (Removal Of Pipelines) వెంటనే తొలగించాలంటూ సోమవారం కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట మత్స్యకారులు ఆందోళన నిర్వహించారు. వివిధ మండలాలకు చెందిన మత్స్యకారులు కలెక్టర్ కృతికా శుక్లా, ఆర్డీవో కిశోర్​ను కలిసి వినతిపత్రం అందజేశారు. సముద్రంలో (Sea Coast) చమురు వెలికితీత వలన జీవనోపాధికి తీవ్ర నష్టం కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు శాశ్వత ఉపాధిని కల్పించకపోతే ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని ప్రభుత్వాన్ని మత్స్యకారులు హెచ్చరించారు. 

రేషన్ కార్డు దారులకు నెలకు 30 వేలు ఇవ్వాలని, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన, ఉచిత వైద్యం కల్పించేలా ఆసుపత్రి నిర్మించాలని, శాశ్వత ఉపాధి చూపే వరకు ఆందోళన విరమించేది లేదంటూ మత్స్యకారులు తేల్చిచెప్పారు. పరిశ్రమల నుంచి సముద్రంలోకి పైప్‌లైన్ వేయడం వల్ల వ్యర్థాలతో  చేపల వృద్ధి తగ్గిపోతుందని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు. చేపల వేట సమయంలో బోట్లు, వలలు పైపులైన్లకు తగిలి దెబ్బతింటున్నాయని, దీని వల్ల ఆర్థికంగా నష్టపోతున్నామని అన్నారు. కోనపాపపేటకు చెందిన మత్స్యకారులు ఈ నెల 6 నుంచి ఆందోళన చెేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఆందోళనలపై అధికారులు,యాజమాన్యం స్పందించకపోవడంతో ఈ నెల 8న బోటు తగలబెట్టడమే కాకుండా పలువురు ఒంటిపై పెట్రోలు పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.