'సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వహయంలో మత్స్యకారులకు స్వర్ణయుగం రాబోతోంది' - Fisheries Corporation Chairman - FISHERIES CORPORATION CHAIRMAN
🎬 Watch Now: Feature Video
Published : Jul 25, 2024, 10:29 PM IST
Fisheries Corporation Chairman On Fishermen : తెలంగాణ రాష్ట్రంలో మత్స్యకారులను ఆర్థికంగా, సామాజికంగా ఆదుకునేందుకు తమ ప్రభుత్వం చొరవ చూపుతోందని ఫిషరీస్ వెల్ఫేర్ కార్పోరేషన్ ఛైర్మన్ మెట్టు సాయికుమార్ స్పష్టం చేశారు. మత్స్యకారులను గురించి మాజీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఖండించిన మెట్టు సాయికుమార్ వారి కుటుంబాలను ఇబ్బంది పెట్టిన విషయం కేసీఆర్ మరిచిపోయారా? అని ప్రశ్నించారు.
మత్స్యకారులను రాజకీయం కోణంలో కేవలం ఓటర్లుగానే కేసీఆర్ పరిగణించారని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మత్స్యకార కుటుంబాలను ఆర్థికంగా ఆదుకుంటామన్న సాయికుమార్ అట్టడుగున ఉన్న మత్స్యకారుల కుటుంబాలను ఆదుకోడానికి తమ ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకు వెల్లుతున్నట్లు తెలిపారు. తక్షణమే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మత్స్యకారుల కుటుంబాలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మత్స్యకారులకు స్వర్ణయుగం రాబోతోందని ఆయన జోస్యం చెప్పారు. ఈ సందర్భంగా మత్స్యకారుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన వివరించారు.