అంబర్​పేటలో భారీ అగ్నిప్రమాదం - ఓ మహిళకు గాయాలు - FIRE ACCIDENT AT PAINTING GODOWN - FIRE ACCIDENT AT PAINTING GODOWN

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Aug 15, 2024, 2:36 PM IST

Fire Breaks Out At Painting Company : హైదరాబాద్ అంబర్​పేట మూసీ పరివాహక ప్రాంతంలోని ఓ పెయింట్ గోదాంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గోదాంలో మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. ఈ ప్రమాదంలో ఓ మహిళకు స్వల్ప గాయాలయ్యాయి. 

ఇదీ జరిగింది : స్థానిక వడ్డెర బస్తీలోని ఓ పెయింట్ గోదాంలో మంటలు ఎగిసిపడ్డాయి. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని అగ్నిమాపక సిబ్బంది సాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు. నివాసాల మధ్య పెయింట్ గోదాం ఉండి అగ్నిప్రమాదం ఏర్పడడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. ఈ ఘటనలో కంపెనీకి సమీపంలో నివాసముంటున్న ఓ మహిళకు స్వల్ప గాయాలయ్యాయి. దీంతో ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.

అగ్ని ప్రమాదం జరిగిన ఘటనా స్థలాన్ని ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి పరిశీలించారు. నివాసాల మధ్య అక్రమంగా కొనసాగుతున్న పెయింట్ గోదాంలో జరిగిన అగ్నిప్రమాదంలో ఓ మహిళకు స్వల్ప గాయాలయ్యాయని, ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించామని తెలిపారు. ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియరాలేదని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.