సంగారెడ్డి జిల్లాలోని హెటిరో ల్యాబ్స్ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం - Massive Fire Accident in Sangareddy - MASSIVE FIRE ACCIDENT IN SANGAREDDY
🎬 Watch Now: Feature Video
Published : May 27, 2024, 8:06 PM IST
Fire Accident in Sangareddy Hetero Labs : సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారంలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. గడ్డపోతారంలోని హెటిరో ల్యాబ్స్‌లో భారీగా మంటలు ఎగిసిపడటంతో, దట్టంగా పొగ అలుముకుంది. నాలుగు ఫైరింజన్లతో మంటలను అగ్నిమాపక సిబ్బంది ఆర్పగా, హెటిరో సంస్థకు సంబంధించిన అదనంగా మరో రెండు అగ్నిమాపక శకటాలు మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నించాయి. అయితే దాదాపు మూడు గంటల వ్యవధిలో మంటలు అదుపులోకి వచ్చాయి.
Major Fire Breaks Out in Telangana : మంటలు పెద్ద ఎత్తున చెలరేగడంతో పోలీసులు ఎవ్వరినీ దగ్గరికి పోనివ్వకుండా స్థానికులను నిలుపుదల చేశారు. ఫ్యాక్టరీలోని ఈటీపీ విభాగంలో ప్రమాదం సంభవించినట్లు చెబుతున్నారు. రసాయనాలు అంటుకోవడంతో ప్రమాదం పెద్దగా అయ్యిందని స్థానికులు చెబుతున్నారు. పెద్దపెద్ద శబ్ధాలతో, దట్టమైన పొగలు కిలోమీటర్ల దూరం వరకు కనిపించాయి. కార్మికుల అప్రమత్తతతో ఉండటం వల్ల ప్రాణాపాయం తప్పినట్లు తెలుస్తోంది. భారీ ఎత్తున అగ్నికీలలు ఎగసిపడటంతో, స్థానికులు భయాందోళనకు గురయ్యారు.