సూపర్ మార్కెట్లో మంటలు- రూ.50 లక్షల సరుకు దగ్దం - FIRE ACCIDENT IN SUPER MARKET - FIRE ACCIDENT IN SUPER MARKET
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 29, 2024, 5:58 PM IST
Fire Accident In MSR Super Market In Annamayya District : అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లిలో షార్ట్ సర్కూట్ కారణంగా (MSR) ఎమ్మెస్సార్ సూపర్ మార్కెట్లో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదంలో విలువైన సరుకులు, వివిధ రకాల వస్తువులు కాలిపోయాయని యజమాని తెలిపారు. సుమారు 50 లక్షల రూపాయల మేర ఆస్తి నష్టం జరిగిందని యజమాని ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. సూపర్ మార్కెట్లో షాట్ సర్యూట్ జరిగినప్పుడు ఘటనా స్థలంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. లక్షల సరుకు దగ్దమవడంతో యజమాని కన్నీటి పర్యంతమయ్యాడు.
ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బు, కొంత బంగారం, విలువైన బాండ్లు కాలిపోయాని బాధితుడు వాపోయాడు. లక్షా ఇరవేల డైరీ మిల్క్, ముప్పైవేల రూపాయల ఐస్‌క్రీమ్‌లు, రెండు ఫ్రిడ్జ్‌లు, కంప్యూటర్లు, సీసీటీవీలు సహా పలు వస్తువులు, సరుకులు అన్నీ మంటల్లో కాలిపోయాయని తెలిపారు. తమకు ప్రభుత్వం సహాయం అందిచాలని సూపర్ మార్కెట్ యజమాని కోరారు.