విజయవాడలో భారీ అగ్నిప్రమాదం - ఎవరూ లేకపోవడం వల్ల తప్పిన ప్రాణ నష్టం - Fire Accident - FIRE ACCIDENT
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 18, 2024, 10:56 AM IST
Fire Accident in Medical Ware House in Vijayawada : విజయవాడలో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. బందర్ రోడ్లోని ఓ మెడికల్ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. గోదాంలో ప్రమాదవశాత్తు నిప్పంటుకొని భారీగా పొగ వచ్చినట్లు స్థానికులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. కానీ అగ్నిమాపక సిబ్బంది వచ్చే సరికి గోడౌన్ లోపల పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి.
మెడికల్ గోదాం నుంచి ఎగిసిపడుతున్న మంటలు ఆర్పడానికి అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. 5 అగ్నిమాపక వాహనాల (Fire Engine ) ద్వారా మంటలు అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రమాదం జరిగే సమయంలో గోడౌన్లో ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. గోడౌన్లో జరిగిన అగ్ని ప్రమాదం కారణంగా రూ. 5 కోట్లుపైనే నష్టం జరిగి ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.