సచివాలయంలో కొట్టుకున్న వాలంటీరు, ఉద్యోగి- సామాజిక మాధ్యమాల్లో వైరల్
🎬 Watch Now: Feature Video
Fight Between Volunteer and Secretariat Employee: విధుల్లో ఉన్న సచివాలయ ఉద్యోగి, వాలంటీర్ కార్యాలయంలోనే ఒకరిపై ఒకరు పరస్పర దాడి చేసుకున్న ఘటన అన్నమయ్య జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ఘటన జరిగి నాలుగు రోజులు కాగా ఆలస్యంగా విషయం బయటకు వచ్చింది. వివరాల్లోకి వెళ్తే జిల్లాలోని రాయచోటి పరిధిలోని కొత్తపల్లి సచివాలయంలో వాలంటీర్ సాదిక్ భాషా అడ్మిన్ నందకుమార్‌ను తన రెషన్ కార్డును వేరు చేయాలని రెండు నెలలుగా అడుగుతున్నా పట్టించుకోవడం లేదని తీవ్ర స్వరంతో అడగడంతో ఇద్దరి మధ్య మాటలు పెరిగి తీవ్ర పదజాలంతో దూషిస్తూ ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.
నాలుగు రోజులు క్రితం ఈ ఘటన జరగగా విషయం బయటకు రాకుండా అధికారులు జాగ్రత్త పడ్డారు. అయితే ఈ దాడికి సంబంధించిన వీడియోలు సామాజిక మద్యమాలలో వైరల్ కావడంతో విషయం వెలుగు చూసింది. వాలంటీర్, అడ్మిన్లను నిలువరించేందుకు సిబ్బంది చేసిన ప్రయత్నం విఫలం కావడంతో సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వాలంటీర్‌ను, నందకుమార్‌ను స్టేషన్‌కి తీసుకెళ్లి విచారించారు. వాలంటీర్‌కు గాయాలు కావడంతో పోలీసులు నందకుమార్‌పై కేసు నమోదు చేశారు. సచివాలయంలోనే వాలంటీర్, అడ్మిన్ ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడంతో పురపాలక అధికారులు విచారణ చేపట్టి అడ్మిన్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.