బుడమేరు వరదతో పత్తి పంట నాశనం - ఆత్మహత్యే శరణ్యమంటున్న రైతులు - COTTON CROP DAMAGE DUE TO FLOODS - COTTON CROP DAMAGE DUE TO FLOODS
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 14, 2024, 8:15 PM IST
Farmers Worried about Crop Damage Due to Floods: బుడమేరు వరద చేసిన నష్టం నుంచి రైతులు కోలుకునే పరిస్థితులు కనిపించడం లేదు. కళ్ల ముందే పంట వరదపాలవుతుంటే కాపాడుకోలేక రైతులు మౌనంగా ఉండిపోయారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం తెంపల్లి, మర్లపాలెం, వీరపనేని గూడెం తదితర గ్రామాల్లో పత్తి పండించిన రైతుల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. పత్తి పంట సాగు కోసం ఇప్పటి వరకు ఎకరాకు దాదాపు 40 నుంచి 50 వేల రూపాయల వరకు ఖర్చు చేశామని బుడమేరుకు వచ్చిన వరదల వల్ల పంట పూర్తిగా దెబ్బతిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 10 రోజులు పంట పొలాలు నీటిలోనే ఉండటం వల్ల పత్తి మొక్కలు మాడిపోయాయని అంటున్నారు. ఇప్పుడు మళ్లీ పత్తి సాగు చేయాలంటే వాతవరణం అనుకులించదని వాపోతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని లేనిపక్షంలో చేసిన అప్పులు తీర్చలేక కుటుంబంతా ఆత్మహత్య చేసుకోవడమేనని రైతులు వాపోతున్నారు.