అకాల వర్షంతో అల్లాడుతున్న రైతులు - తడిసిన ధాన్యం - Effect of rain on grain crop
🎬 Watch Now: Feature Video
Farmers Suffering Due to Suddenly Rain in Mummidivaram: కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో అకాల వర్షం రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. పంట చేతికొచ్చే సమయంలో వానలు పడటంతో నష్టం తప్పేలా లేదు. నాలుగు మండలాల్లో వేల ఎకరాల్లో కౌలు రైతులు వరి సాగు చేశారు. తొలకరిలో అధిక వర్షాలు, వరదలకు నష్టపోయిన కర్షకులు దాళ్వా పంటలోనైనా గట్టెక్కుదామనే ఆశతో పొలం బాట పట్టారు. సాగునీటి ఎద్దడిని ఎదుర్కొంటూనే ముందుకు సాగారు. అష్టకష్టాలు పడి పంటను పండించారు. నిన్నటి వరకు బంగారు రంగులో మెరిసిపోతూ కలకల్లాడిన చేలు ఈదురుగాలులతో కూడిన వర్షానికి నేలకొరిగాయి.
మరోవైపు రెండు రోజుల క్రితం కోసి ఆరబెట్టిన ధాన్యం తడిసి ముద్దయింది. ధాన్యపు రాశులను ఎండబెట్టేందుకు అన్నదాతలు నానా తంటాలు పడుతున్నారు. ధాన్యం రాశుల కిందకు వర్షపు నీరు చేరితే రంగు మారటమే కాకుండా మొలకొచ్చే అవకాశం ఉందని రైతుల ఆందోళన చెందుతున్నారు. మిషన్ కోత వల్ల పంట దిగుబడి తగ్గుతుందని ఎకరాకు 45 బస్తాలకు బదులు 35 బస్తాలు వస్తుందంటున్నారు రైతులు. వాతావరణ అనుకూలించకపోతే అదీ చేతికి రాదని వాపోతున్నారు.