రైతులకు మొండి చెయ్యి చూపించిన వ్యాపారులు - రూ.3.40 కోట్లు బకాయి - FARMERS PROTEST FOR CROP CASH - FARMERS PROTEST FOR CROP CASH
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 30, 2024, 4:47 PM IST
Farmers Protest For Crop Cash in Eluru District : పంటను కొనుగోలు చేసిన వ్యాపారులు నగదు చెల్లించకపోవడంతో అన్నదాతలు ధర్నాకు దిగిన సంఘటన ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలంలో జరిగింది. గవరవరం గ్రామంలో గోడౌన్ వద్ద పురుగుల మందు డబ్బాలు పట్టుకుని ఆందోళన చేశారు. సూరిబాబు అనే దళారి మొక్కజొన్నలు కొనుగోలు చేసి 3.40 కోట్ల రూపాయలు బకాయి పెట్టినట్లు రైతులు తెలిపారు.
అసలు ఏం జరిగిందంటే పోలవరం మండలంలోని పలు గ్రామాలకు చెందిన రైతులు వద్ద దళారి సూరిబాబు మొక్కజొన్న, ధాన్యాన్ని కొనుగోలు చేశారు. వాటిని కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం మండలంలోని పలువురు వ్యాపారులకు విక్రయించగా వాళ్లు డబ్బులు చెల్లించలేదని దళారి చెబుతున్నారు. దీంతో 50 మంది రైతులు దళారితోపాటు గవరవరం గ్రామంలో ఉన్న గోడౌన్ వద్ద ధర్నా చేపట్టారు. దీంతో గోదాముల్లో నిల్వ ఉంచిన పంటను వ్యాపారులు తరలించే ప్రయత్నం చేయడంతో లారీలను రైతులు అడ్డుకుని పోలీసులకు సమాచారం అందించారు. రైతులకు న్యాయం చేయాలని స్థానిక టీడీపీ నేతలు డిమాండ్ చేశారు.