తిరుగు ప్రయాణంలో పులి! - సమీప గ్రామాల్లో అలజడి - ఏలూరు జిల్లాలో పులి సంచారం

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 1, 2024, 1:58 PM IST

Farmers Found Tiger Footprint In Gangavaram : గత వారం రోజులుగా ఏలూరు జిల్లాలో కలకలం సృష్టిస్తున్న పులి ఉత్కంఠ ఇంకా కొనసాగుతోంది. కొయ్యలగూడెం మండలం గంగవరంలో పులి పాదముద్రలు కనిపించాయని స్థానికులు తెలపడంతో అటవీశాఖ అధికారులు  అప్రమత్తం అయ్యారు. పులి సంచారం నేపథ్యంలో ఏర్పా టైన ప్రత్యేక బృందం గంగవరం చేరుకుని స్థానికులతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు కుడి కాలువ పరిసరాల నుంచి వచ్చిన మార్గంలోనే అభయార ణ్యంలోకి వెనక్కి వెళ్లినట్లు దాని అడుగుజాడల ద్వారా గుర్తించినట్లు టైగర్ మానిటరింగ్ ప్రత్యేక బృందం అధికారి, నూజివీడు ఎస్ఆర్​వో దావీదు రాజు తెలిపారు. మరోవైపు కొద్దిరోజుల కిందట స్థానికంగా మొక్కజొన్న చేలో నుంచి పులి వెళ్లిన పాదముద్రలను స్థానికులు అధికారులకు చూపించారు. దీంతో పులి తిరిగి అదే మార్గంలో వెనక్కి వెళ్లే అవకాశం ఉందని అంచనాతో పరిసర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. 

Tiger In Eluru District : ఈ మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని టాంటాం వేయించారు. అనుమానం ఉన్న మార్గాల్లో ట్రాప్ కెమెరాలను అమర్చారు. జాతీయ పులి సంరక్షణ అథారిటీ సూచనలతో ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసి, నిరంతరం పులి కదలికలను తెలుసుకునేలా ప్రత్యేక బృందాల ద్వారా పెట్రోలింగ్ నిర్వహిస్తున్నామని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.