మిర్చి మొక్కల మధ్యలో గంజాయి సాగు- అరెస్టు చేసిన పోలీసులు - పొలంలో గంజాయి మొక్కలు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 1, 2024, 1:19 PM IST
Farmer Growing Cannabis Plants in the Field at Satyasai District : శ్రీ సత్యసాయి జిల్లా గుడిబండ మండలం మందలపల్లిలో ఓ పొలంలో పండిస్తున్న గంజాయి మొక్కలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హనుమంతరాయప్ప అనే రైతు తన పొలంలో గంజాయి (Cannabis) మొక్కలను పెంచుతున్నట్లు వచ్చిన సమాచారంతో పోలీసులు, వ్యవసాయ అధికారులు పొలంలో తనిఖీ చేశారు.
రైతు పొలంలోని వక్క, మిరప చెట్ల మధ్యలో 13 గంజాయి మొక్కలు ఉన్నట్లు గుర్తించారు. గంజాయిని పండిస్తున్న రైతు హనుమంతరాయప్పను పోలీసులు (Police) అరెస్టు చేశారు. స్వాధీనం చేసుకున్న గంజాయి 1650 గ్రాములుగా ఉన్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా పోలీసులు, వ్యవసాయ అధికారులు మాట్లాడుతూ ఎవరైనా చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మాదక ద్రవ్యాల వినియోగం, విక్రయం నేరమని ఇటువంటి అక్రమాలకు పాల్పడితే జైలు జీవితం గడపాల్సి వస్తుందని పేర్కొన్నారు. ఇటువంటి మాదక ద్రవ్యాల (Drugs) నిర్మూలన ప్రతి పౌరుడి బాధ్యత అని తెలిపారు.