"ఓజీ ఓజీ అంటే 'మోదీ మోదీ' అని వినిపించేది" - పవన్ నోట హీరోల మాట - ఏమన్నారంటే! - PAWAN KALYAN SPEECH

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 14, 2024, 3:38 PM IST

Updated : Oct 14, 2024, 4:46 PM IST


Fans Slogans While Deputy Chief Minister Pawan Kalyan Was Speaking : కృష్ణా జిల్లా కంకిపాడులో నిర్వహించిన 'పల్లె పండుగ' కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మాట్లాడుతుండగా అభిమానులు ఓజీ.. ఓజీ అంటూ నినాదాలు చేశారు. దీనికి స్పందించిన పవన్ కళ్యాణ్ తాను పాల్గొన్న చాలా కార్యక్రమాల్లో అభిమానులు ఓజి, ఓజి(OG) అంటూ నినాదాలు చేస్తున్నారని గుర్తుచేశారు. అయితే చాలా రోజులు తనకు ఓజీకి బదులు మోడీ, మోడీ అని వినిపించేదని చెప్పారు. ఆ తరువాత ఓజీ అని అర్థం అయ్యిందన్నారు. ముందు మనం మన రోడ్లు, మన ప్రాంతాలు బాగు చేసుకుందామని, ఆ తరువాత వినోదాన్ని ఆస్వాదిద్దామన్నారు. నాయకుడిగా, హీరోగా తనను అభిమానిస్తారని, తన తోటి హీరోలు అందరిలో కూడా ఒక్కొక్కరిదీ ఒక్కో శైలి ఉందన్నారు. 

అందరు హీరోలు బాగుండాలని అందరూ మంచి సినిమాలు‌ చేయాలని ఆకాంక్షించారు. ముందు బాధ్యతతో పని చేయాలని ఆ తరువాత వినోదం తప్పకుండా ఉంటుందని పవన్ అభిమానులకు చెప్పారు. మా ఆకాంక్ష అంతా ఒక్కటే, రాష్ట్రంలోని ప్రజలంతా బాగుండాలన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు రావాలని తెలిపారు. అలాగే పల్లెల్లో వెలుగులు నిండాలన్నారు. రాష్ట్ర శ్రేయస్సు కోసం బలంగా ఉన్నప్పుడే అనుకున్నది సాధ్యమవుతుందన్నారు. ఒకేరోజు 13,326 గ్రామ పంచాయతీల్లో గ్రామసభలు నిర్వహించడం దేశంలో మొదటిసారని పవన్ కల్యాణ్ తెలిపారు.

Last Updated : Oct 14, 2024, 4:46 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.