ఘనంగా వైఎస్ వివేకా 74వ జయంతి - విగ్రహాన్ని ఆవిష్కరించిన సునీత - YS Viveka 74th Birth Anniversary - YS VIVEKA 74TH BIRTH ANNIVERSARY
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 8, 2024, 5:51 PM IST
Family Members Paid Tribute to YS Viveka: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి 74వ జయంతి సందర్భంగా పులివెందులలోని ఆయన సమాధి వద్ద పలువురు ఘనంగా నివాళులర్పించారు. వివేక కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్ రెడ్డి, బావమరిది శివ ప్రకాష్ రెడ్డి ఇతర కుటుంబ సభ్యులు అంతా కలిసి వివేక సమాధి వద్ద పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అలాగే ఇంటి వద్ద ఏర్పాటు చేసిన కేక్ కటింగ్లో సునీత దంపతులు పాల్గొని వివేక అభిమానులకు పంచిపెట్టారు. నిత్యం ప్రజలలో ఉంటూ ప్రజాభిమానాన్ని చురగొన్న వ్యక్తి దూరం అవడం చాలా బాధాకరంగా ఉందని అన్నారు.
వివేకా విగ్రహం ఆవిష్కరణ: లింగాల మండలం బోనాల గ్రామంలో వైఎస్ వివేకానంద రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించి, వాటర్ ప్లాంట్ను వైఎస్ సునీత ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ సునీత భర్త నరెడ్డి రాజశేఖర్ రెడ్డి, శివ ప్రకాష్ రెడ్డి, వైఎస్ వివేకానంద రెడ్డి అభిమానులు పాల్గొన్నారు.