డబ్బుల పంపిణీ, ప్రలోభాలపై నిఘా- అవాంఛనీయ ఘటనలకు అవకాశం లేదు: తిరుపతి ఎస్పీ - Tirupati SP Krishakant Patel - TIRUPATI SP KRISHAKANT PATEL

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 12, 2024, 5:16 PM IST

Tirupati SP Krishakant Patel: ఓటర్లు భయపడకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలని తిరుపతి జిల్లా ఎస్పీ కృష్ణకాంత్‍ పటేల్‍ తెలిపారు. జిల్లాలో భద్రతాపరంగా అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. ఎటువంటి గోడవలు జరిగినా వెంటనే అప్రమత్తమయ్యి చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. తిరుపతి, చంద్రగిరి నియోజకవర్గాల తీవ్రత దృష్ట్యా ఐదు ఫ్లయింగ్‍ స్క్వాడ్స్ ఏర్పాటు చేసి పోలింగ్‍ ను పర్యవేక్షిస్తామంన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు ఏర్పాట్లు చేశామన్నారు. ఎక్కడైనా గలాటలు జరిగితే కేవలం నాలుగు నిమిషాల్లో పోలీసులు ఘటనా ప్రదేశానికి చేరుకునేలా ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ తెలిపారు. అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడేవారిపై కఠన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. డబ్బుల పంపిణీ, ప్రలోభాలపై ఎప్పటి కప్పడు నిఘా పెడుతున్నట్లు తెలిపారు. అలాటి వారిపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. కేంద్ర బలగాలు సైతం  తిరుపతిలో మోహరించినట్లు తెలిపారు. తిరుపతి, చంద్రగిరిలో ఐదు కంపెనీల బలగాలను మోహరించినట్లు తెలిపారు. కేంద్ర బలగాల సహాయంతో ఎన్నికలు సజావుగా సాగేలా చర్యలు చేపడతామంటున్న తిరుపతి ఎస్పీ కృషకాంత్‍ పటేల్‍ తో ఈటీవీ భారత్ ముఖాముఖి.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.