రూ.25 వేల కోట్ల బకాయిలను ప్రభుత్వం పెండిగ్‌లో పెట్టింది: సూర్యనారాయణ - KR Suryanarayana - KR SURYANARAYANA
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 23, 2024, 11:48 AM IST
F2F With KR Suryanarayana on Employees Issues : రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు రూ. 25 వేల కోట్ల బకాయిలు పెట్టిందని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ ఆరోపించారు. ఈ బకాయిలను అడిగేందుకు వెళ్లినా ప్రభుత్వ అధికారులు పట్టించుకోవటం లేదని ఆక్షేపించారు. కొత్త పీఆర్సీని నియమించినట్టు ప్రభుత్వం ప్రకటించినా ఆయన కార్యాలయం ఎక్కడ ఏర్పాటు చేశారో ఇప్పటికీ అంతుపట్టడం లేదని విమర్శించారు. ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిల కోసం అడిగితే వేధింపులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఉద్యోగులకు చెల్లించవలసిన బకాయిల గురించి ప్రభుత్వాన్ని అడిగితే ఎలాంటి స్పందన లేదని కేఆర్ సూర్య నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగ బకాయిల విషయంపై గతంలో ప్రభుత్వంతో చర్చించినప్పుడు కూడా ఎలాంటి సృష్టత ఇవ్వలేదని పేర్కొన్నారు. ఉద్యోగులకు చెల్లించవలసిన మొత్తం బకాయిల గురించిన వివరాలను సమాచారం హక్కు చట్టం కింద కూడా ఎలాంటి వివరాలు ఇవ్వడం లేదని తెలిపారు. ప్రభుత్వం వేస్ అండ్ మీన్స్ కింద రుణాలు తీసుకుంటున్న ఉద్యోగుల బకాయిలు చెల్లించడం లేదని మండిపడ్డారు.