'రైతుల సంక్షేమం కోసమే కాంగ్రెస్​లో చేరా - రేవంత్‌రెడ్డి నాయకత్వంలో మరింత కష్టపడి పని చేస్తా' - pocharam joined in Congress - POCHARAM JOINED IN CONGRESS

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Jun 21, 2024, 1:53 PM IST

Ex Speaker MLA Pocharam Srinivas Reddy Joined In Congress : మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్​లో చేరారు. హైదరాబాద్‌లోని తన నివాసానికి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డిల సమక్షంలో తన కుమారుడితో కలిసి హస్తం తీర్థం పుచ్చుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పోచారం శ్రీనివాస్, ఆయన కుమారుడికి కాంగ్రెస్‌ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. 

ఈ సందర్భంగా అన్నదాతల సంక్షేమం కోసమే కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు పోచారం స్పష్టం చేశారు. రైతుల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. రైతుల సంక్షేమం దిశగా సీఎం రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నారని, వారు తీసుకుంటున్న చర్యలను అభినందిస్తున్నట్లు తెలిపారు. ఆయన నాయకత్వంలో మరింత కష్టపడి పని చేస్తామని పేర్కొన్నారు. ప్రజల కోసం పని చేసే నాయకత్వాన్ని సమర్థించేందుకే రేవంత్​కు మద్దతిస్తున్నామని తెలిపారు. రేవంత్‌ రెడ్డి నాయకత్వంలో మరింత కష్టపడి పని చేస్తానని స్పష్టం చేశారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.