పోలవరం నిధులపై ప్రజలకు వాస్తవాలు వెల్లడించాలి: చింతా మోహన్ - Chinta Mohan on Polavaram Funds - CHINTA MOHAN ON POLAVARAM FUNDS
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 19, 2024, 5:43 PM IST
Former MP Chinta Mohan on Polavaram Funds : పోలవరం ప్రాజెక్టుపై నేటి వరకు ఎన్ని నిధులు ఖర్చు పెట్టారు, ఇంకా ఎంత ఖర్చు అవుతుందో జ్యుడీషియల్ విచారణ జరిపించి ప్రజలకు వాస్తవాలు తెలపాలని కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ చింతా మోహన్ డిమాండ్ చేశారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో చింతా మోహన్ మాట్లాడుతూ రాష్ట్రంలో నిరుద్యోగం, అధిక ధరలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రభుత్వం ధరలను స్థిరీకరించలేకపోతున్నారని ఆరోపించారు.
2019లో 2 లక్షల 65 వేల కోట్లు అప్పులు చూపిస్తే, జగన్ హయాంలో రూ. 10 లక్షల కోట్లు అప్పులు చేశారని మాజీ ఎంపీ తెలిపారు. నెలకు రూ. 10 వేల కోట్లు వడ్డీలు కట్టాల్సి వస్తుందని, జగన్ ఆంధ్రప్రదేశ్‌కు చేసిన ఘనమైన పని రూ. 10 లక్షల కోట్లు అప్పులు చేయడమేనని ఎద్దేవా చేశారు. లక్షల కోట్లు ఏమయ్యాయి, ఏమన్నా అభివృద్ధి చేశారా? అని ప్రశ్నించారు. జగన్ చేసిన అప్పుల లెక్కలు చెప్పాల్సిన బాధ్యత ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఉందని అన్నారు. అప్పుల నుంచి రాష్ట్రాన్ని ఎలా బయట పడేస్తారో చంద్రబాబుకే తెలియాలని, విభజనలో ఇచ్చిన హామీలను ఈ ఐదు సంవత్సరాల్లో అయినా సాధించుకోవాలని సూచించారు.