'గో బ్యాక్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి' - పుంగనూరులో నిరసన- పెద్దిరెడ్డి పర్యటన వాయిదా! - Peddi Reddy Punganur Tour Cancelled - PEDDI REDDY PUNGANUR TOUR CANCELLED
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 15, 2024, 4:49 PM IST
Ex Minister Peddi Reddy Punganur Tour Cancelled : కూటమి నేతల నుంచి తీవ్ర వ్యతిరేకతతో పుంగనూరు పర్యటన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రద్దు చేసుకున్నారు. ఇవాళ పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటిస్తారని స్థానిక వైఎస్సార్సీపీ నేతలు ప్రకటించారు. అందుకు తగ్గ ఏర్పాట్లు సైతం చేశారు. అయితే కూటమి నేతలు పెద్దిరెడ్డి పర్యటనను నిరసిస్తూ అంబేడ్కర్ కూడలి నుంచి ఇందిర కూడలి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గో బ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పర్యటన (Visit) మాజీ మంత్రి పెద్దిరెడ్డి వాయిదా వేసుకున్నారు.
NDA Leaders Protest : మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటిస్తారనే సమాచారం తెలుసుకున్న టీడీపీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. మాజీ మంత్రి గోబ్యాక్, పెద్దిరెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. నియోజకవర్గంలో పర్యటించవద్దని నాయకులు మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని హెచ్చరించారు.