జీఎస్టీ చెల్లింపుల కేసు - మాజీ మంత్రి నారాయణ అల్లుడు పునీత్​కు ఊరట - Puneeth GST Case

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 12, 2024, 4:41 PM IST

Updated : Mar 12, 2024, 4:53 PM IST

Ex Minister Narayana Son in Law Puneeth GST case: బస్సులు కొనుగోలు చేసి, జీఎస్టీ చెల్లించలేదంటూ మాజీ మంత్రి నారాయణ అల్లుడు పునీత్​పై నమోదైన కేసులో ఏపీ హైకోర్టులో ఆయనకు ఊరట లభించింది. బస్సులు కొనుగోలు చేసి జీఎస్టీ చెల్లించలేదన్న ఆరోపణలతో పునీత్​పై కేసు నమోదైంది. ఇదే అంశంపై పునీత్ హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్​ను విచారించిన న్యాయస్థానం పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేసింది.    

ఇన్​స్పైర్ మేనేజిమెంట్ సర్వీసెస్ పేరుతో మాజీ మంత్రి నారాయణ అల్లుడు పునీత్ బస్సులు కొనుగోలు చేసి జీఎస్‌టి చెల్లించకుండా ప్రభుత్వాన్ని మోసం చేశారంటూ నెల్లూరు, బాలాజీ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. కేసును కొట్టేయలని కోరుతూ పునీత్ హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌ను న్యాయస్థానం విచారించింది. అరెస్ట్‌తోపాటు తొందరపాటు చర్యలు తీసుకోవద్దని, ఏపీ హైకోర్టు పోలీసులకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దర్యాప్తు కొనసాగించవచ్చని సూచించింది. తదుపరి విచారణ వాయిదా వేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది.  

Last Updated : Mar 12, 2024, 4:53 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.