ఓట్ల కోసం రాజకీయ నేతల పాట్లు - హోటల్లో పూరీలు చేసి ఓటర్లకు వడ్డించిన ఎర్రబెల్లి - Errabelli Dayakar Election Campaign - ERRABELLI DAYAKAR ELECTION CAMPAIGN
🎬 Watch Now: Feature Video
Published : May 7, 2024, 2:40 PM IST
EX Minister Errabelli Dayakar Election Campaign : సార్వత్రిక ఎన్నికలవేళ ఓటర్లను ఆకర్షించుకునేందుకు నాయకులు శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు. వారి మన్ననలు పొందేందుకు పడరాని పాట్లు పడుతూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. తాజాగా ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ మంత్రి ఎర్రబెల్లి ఏకంగా ఓ హోటల్లో పూరీలు చేసి అక్కడి ప్రజల మన్ననలు పొందే ప్రయత్నం చేశారు. హనుమకొండ జిల్లా ఐనవోలు మండలంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విస్తృత ప్రచారం నిర్వహించారు.
రానున్న ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి సుధీర్ కుమార్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. రోడ్ షో చేసి పలు గ్రామాల్లో గడపగడప ప్రచారం నిర్వహించారు. నందనం గ్రామంలో ఓ హోటల్‌కు వెళ్లి తాను వంట చేస్తానని తన వంటకు చాలా మంది ఫ్యాన్స్ఉన్నారని ఎర్రబెల్లి అన్నారు. నందనం గ్రామాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ అభ్యర్థి సుధీర్ కుమార్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.