సుధాకర్‌యాదవ్‌కు డీఎల్ రవీంద్రారెడ్డి మద్దతు- రాష్ట్రంలో ప్రజాస్వామ్యం గెలవాలని ఆకాంక్ష - DL Comments on Elections - DL COMMENTS ON ELECTIONS
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 9, 2024, 4:56 PM IST
Ex Minister DL Ravindra Reddy Comments on Elections : తెలుగుదేశం (Telugudesam), జనసేన (Janasena), బీజేపీ (BJP) కూటమే అధికారంలోకి వస్తుందని మాజీమంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి అన్నారు. స్థానిక అంశాల దృష్ట్యా టీడీపీ (TDP) అభ్యర్థి సుధాకర్ యాదవ్‌కే తన మద్దతు ఇస్తున్నట్లు రవీంద్రారెడ్డి ప్రకటించారు. ఎంపీ (MP)కి ఓటు వేసే విషయంలో వివేకం సినిమా చూసి ఓటు (Vote) వేయాలని ఓటర్లను కోరుతున్నట్లు స్పష్టం చేశారు. నాకు వ్యక్తిగతంగా ఎటుంటి అజెండా లేదు. కూటమి గెలుస్తుందని నా నమ్మకం. ప్రజలంతా ఆలోచించి ఓటు వెయ్యండి.
'మైదుకూరు రాజకీయ పరిస్థితుల దృష్టా సుధాకర్ యాదవ్‌కు మద్ధతు ఇవ్వాలనుకుంటున్నా. జనసేన, తెలుగుదేశం, బీజేపీకి ఎన్ని సమస్యలున్నా కూటమే అధికారంలోకి వస్తుంది. ఆ పై ప్రజలకు ఎలా మేలు చెయ్యాలో ఆలోచించండి. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం గెలవాలి, ప్రజలు గెలవాలి. మీరు గెలవండి రాష్ట్రాన్ని పునర్నిర్మించండి. నేనూ ప్రత్యక్ష రాజకీయాల్లో (politics) లేనప్పటికీ ప్రజలకు అందుబాటులోనే ఉంటాను.'- డీఎల్ రవీంద్రారెడ్డి