'విజన్ ఉన్న నాయకుడు వస్తేనే రాష్ట్రం అభివృద్ధి సాధ్యం' - Vasantha Nageswara Rao on YSRCP - VASANTHA NAGESWARA RAO ON YSRCP

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 30, 2024, 5:36 PM IST

EX-Home Minister Vasantha Nageswara Rao Comments on YSRCP Govt :  వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో తగలబడుతున్న, నాశనం అయిపోతున్న, దెబ్బతింటున్న రాష్ట్రం బాగుపడాలంటే తిరిగి విజన్ ఉన్న నాయకుడు, ప్రభుత్వం రావాలని మాజీ హోం మంత్రి, సీనియర్ నాయకుడు వసంత నాగేశ్వరరావు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం ఐతవరం గ్రామంలోని స్వగృహంలో బహుజన జేఏసీ అధ్యక్షుడు పోతుల బాలకోటయ్య బీసీ సంక్షేమ సంఘం మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు నూకాలమ్మతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో విద్య, ఉపాధి అవకాశాలు లేకపోవడం వల్ల నిరుద్యోగ యువత ఇతర రాష్ట్రాలకు వలస వెళ్తున్నారని నాగేశ్వరరావు ధ్వజమెత్తారు. 

రాష్ట్రంలో శాంతి భద్రతలు బాగుండి పరిశ్రమలు విద్యా, ఉపాధి అవకాశాలు పెరిగినప్పుడే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. సహజ వనరులు వినియోగించుకొని అభివృద్ధి చెందాలని సూచించారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు అమరావతిని రాజధానిగా చేసుకొని పరిపాలన సాగించారని, అప్పుడు అక్కడ భూముల విలువ గణనీయంగా పెరగటంతో ప్రజలు లబ్ధి పొందారన్నారు వసంత నాగేశ్వరరావు అన్నారు.  

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.