చీరాలలో ఈటీవీ-ఈనాడు ఆధ్వర్యంలో ఓటరు నమోదు అవగాహన సదస్సు - ఓటరు నమోదు అవగాహన సదస్సు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 8, 2024, 12:16 PM IST
ETV-Eenadu Voter Registration Awareness Conference: ప్రపంచంలోనే భారత్ అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమని ఇందులో ఓటు ఎంతో కీలకమని బాపట్ల జిల్లా చీరాల తహశీల్దార్ నాసరయ్య అన్నారు. చీరాల భారతి డిగ్రీ కళాశాలలో ఈటీవీ-ఈనాడు ఆధ్వర్యంలో ఓటరు చైతన్యంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాసరయ్య మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో ఓటు హక్కును యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు. విద్యార్థులకు ఓటు హక్కుపై అవగాహన కల్పించారు. ఎటువంటి ప్రలోభాలకు లొంగకూడదని, నిష్పక్షపాతంగా ఓటు వినియోగించుకునే అధికారం ఉందన్నారు. ఇలాంటి ప్రజా చైతన్య కార్యక్రమాలు చేపడుతున్న ఈటీవీ-ఈనాడు యాజమాన్యాన్ని ఆయన అభినందించారు.
ప్రధానాచార్యుడు జయశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు కోసం నమోదు చేసుకోవాలన్నారు. ఓటు అనేది అభ్యర్ధుల గెలుపు ఓటములను నిర్ణయిస్తోందని కళాశాల అకడమిక్ డైరెక్టరు సంజీవ కుమార్ పేర్కొన్నారు. అందుకే ఎన్నికల్లో ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో బీఎల్వో శ్రీనివాస్ విద్యార్థులతో ఓటు నమోదు చేయించారు. ఓటు నమోదుపై విద్యార్థులకు లేవనెత్తిన అనుమానాలను నివృత్తి చేశారు.