LIVE: జగన్ పాలనలో పోలీసులు దమనకాండలపై - ప్రత్యేక డిబేట్ ప్రత్యక్ష ప్రసారం - Police Department Favors CM Jagan - POLICE DEPARTMENT FAVORS CM JAGAN
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : May 8, 2024, 9:01 AM IST
|Updated : May 8, 2024, 10:58 AM IST
ETV Bharat Special Debate LIVE : గత ఐదేళ్లుగా కొనసాగుతున్న అరాచకాలు, దాష్టీకాలు, దౌర్జన్యాలు, దమనకాండలు ఎన్నికల వేళ మరింత తీవ్రమయ్యాయి! ప్రతిపక్ష పార్టీల శ్రేణులపై వైఎస్సార్సీపీ గూండాలు ఇష్టానుసారం దాడులకు తెగబడుతున్నారు. నిందితులకు వెన్నుదన్నుగా నిలుస్తున్న పోలీసులు బాధితులపైనే రివర్స్ కేసులు పెడుతున్నారు. ఇప్పుడు ఎన్నికల కోడ్ వేళ ఫిర్యాదుల మేరకు పలు జిల్లాల ఎస్పీలపై ఈసీ బదిలీ వేటు వేస్తున్నా వారి స్థానంలో వచ్చిన కొత్తవారు పాత పద్ధతులనే పాటిస్తున్నారు. అధికార పార్టీ అరాచకాలు పెచ్చుమీరుతూనే ఉన్నాయి. ఎంత మందిపై బదిలీ వేటు వేసినా ప్రయోజనమేంటనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. నూతనంగా నియమించిన వారిలో చాలా మంది ఐదేళ్లలో అధికార వైఎస్సార్సీపీకు మద్దతుగా, ప్రతిపక్షాలను అణచివేసిన చరిత్ర ఉంది. ప్రతిపక్షపార్టీ నేతలను కక్షపూరితంగా వేధిస్తూ, వారిపై అక్రమ కేసులు బనాయించారు. అధికార పార్టీ నాయకులు దాడులు, దౌర్జన్యాలకు తెగబడితే వారిని వదిలేసి బాధితులపైనే రివర్స్ కేసులు పెట్టారు. తెలుగుదేశంలో క్రియాశీల నేతలను లక్ష్యంగా చేసుకుని వేధించారు. ఎన్నికల షెడ్యూలు వచ్చాక కూడా వైసీపీ పట్ల తన విధేయత, స్వామిభక్తిని ప్రదర్శించటంలో పోలీసులు వెనక్కి తగ్గలేదు. జగన్ పాలనలో పోలీసులు దమనకాండలపై ప్రత్యేక డిబేట్ ప్రత్యక్ష ప్రసారం
Last Updated : May 8, 2024, 10:58 AM IST