దిల్లీ ఫ్లైట్ టికెట్ గురించి చంద్రబాబు ఎందుకు ఆరా తీశారో తెలుసా? - Vizianagaram MP Kalisetti Appalanaidu Interview - VIZIANAGARAM MP KALISETTI APPALANAIDU INTERVIEW

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 7, 2024, 2:24 PM IST

Vizianagaram MP Kalisetti Appalanaidu Interview : చంద్రబాబు అధ్యక్షతన జరిగిన తొలి పార్లమెంటరీ పార్టీ సమావేశంలో విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. చంద్రబాబు అయన పేరు పలుమార్లు ప్రత్యేకంగా ప్రస్తావించటం సర్వత్రా చర్చనీయాంశం అయింది. ఒక సామాన్య కార్యకర్తకు, చిన్న నాయకులకు కూడా పార్టీలో పదవులు, అవకాశాలు కల్పించే విధంగా తన నిర్ణయాలు ఉంటున్నాయని చంద్రబాబు స్పష్టం చేశారు. నాయకులుగా ఉన్న మీరు, ఇతర నాయకులతో కూడా అలాగే ఉండాలని దిశానిర్దేశం చేశారు. కష్టపడి, విధేయతతో ఉంటే పదవులు వస్తాయని దానికి విజయనగరం ఎంపీగా గెలిచిన కలిశెట్టి అప్పలనాయుడే ఉదాహరణ అని అన్నారు.

Chandrababu Praise Kalisetti Appalanaidu : అప్పలనాయుడుకు ఎంపీ టిక్కెట్ ఇస్తే చాలా మంది చాలా వ్యాఖ్యలు చేశారని అయితే కష్టపడి పనిచేసి అందరినీ కలుపుకుని పోయి కలిశెట్టి గెలిచాడని చంద్రబాబు అభినందించారు. అప్పల నాయుడు ఆర్థికంగా బలవంతుడు కాకపోయినా పార్టీలో ఉన్న సామాన్యులకు టిక్కెట్లు వస్తాయి అనడానికి ఇదొక ఉదాహరణ అని చంద్రబాబు వివరించారు. ఎంపీలందరూ నేటి రాత్రికి, లేదా రేపు ఉదయానికి దిల్లీ చేరుకోవాలని సూచించారు. కలిశెట్టి గురించి చంద్రబాబు ఏమన్నారు ఏమిటి, ఢిల్లీ ఫ్లైట్ టికెట్ గురించి కూడా ఎందుకు ఆరా తీశారన్నది కలిశెట్టితో ఈటీవీ ప్రత్యేక ముఖాముఖి.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.