గోశాలలోకి ప్రవేశించి ఏనుగు హల్చల్- ప్లీజ్ వెళ్లిపోండి స్వామీ అంటూ స్థానికులు రిక్వెస్ట్! - Elephant In Cowshed At Coimbatore - ELEPHANT IN COWSHED AT COIMBATORE
🎬 Watch Now: Feature Video


Published : Apr 4, 2024, 9:52 AM IST
Elephant In Cow Shed At Coimbatore : తమిళనాడులోని కోయంబత్తూరులో ఓ ఏనుగు గోశాలలోకి ప్రవేశించి హల్చల్ చేసింది. ఆహారం కోసం వెతుక్కుంటూ అటవీ ప్రాంతం నుంచి బొలువంపట్టి ప్రాంతంలోకి వచ్చింది. అక్కడ పంటలను నాశనం చేసింది. ఆ తర్వాత అక్కడే ఉన్న గోశాలలోకి ప్రవేశించింది. గోశాలలో పశువుల కోసం ఉంచిన దాణా బస్తాలను ఎత్తి పడేసింది.
స్థానికులు ఆ ఏనుగు తరిమేందుకు ప్రయత్నించారు. కానీ కుదరలేదు. దీంతో అటవీ అధికారులకు సమాచారం అందించారు. అధికారులు సైరన్ మోగించి, టపాసులు పేల్చి ఏనుగును అక్కడి నుంచి అడవిలోకి తరిమేశారు. అయితే స్థానికులు గోశాలలో ఉన్న ఏనుగును 'దయచేసి మీరు వెళ్లండి స్వామీ, గుడ్ బాయ్ కదా ఆవులు భయపడతున్నాయి' అంటూ తరిమికొట్టే ప్రయత్నం చేసిన ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
నిద్రపోతున్న వృద్ధురాలిపై ఏనుగు దాడి
ఇటీవల కోయంబత్తూరులోని ముడుక్కరయ్ అటవీ ప్రాంతంలో ఇంటి బయట నిద్రపోతున్న వృద్ధురాలిపై దాడి చేసింది. అనంతరం అక్కడి నుంచి వెళ్లిన ఏనుగు పక్కనే ఉన్న మరో ఇంట్లోకి ప్రవేశించింది. పూర్తి కథనం కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.