గజరాజుల గర్జన - ఏనుగుల దాడులతో అల్లాడుతున్న అక్కడి రైతాంగం - elephant attack on Crop fields
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 1, 2024, 1:17 PM IST
Elephant Attack On Crop Fields in Tirupathi District: అడవులలో ఉండాల్సిన ఏనుగులు అటవీ సమీప ప్రాంతాలకు వచ్చి పంట పొలాలపై దాడులు చేస్తూ కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయని తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత పది రోజులుగా మండలంలోని శేషాచల అటవీ సమీప ప్రాంతాలలో ఏనుగుల దాడులు అధిక మయ్యాయని రైతులు చెబుతున్నారు.
అటవీ సమీప గ్రామాలైన ఎల్లంపల్లి, భీమవరం, చిన్న రామాపురం, మామిడి మానుగడ్డ ప్రాంతాలలోని పంట పొలాలపై ఏనుగుల దాడులు అధికంగా ఉన్నాయని రైతులు తెలిపారు. అటవీ శాఖ అధికారులకు ఏనుగుల దాడి గురించి తెలియజేసినా పంట పొలాల వైపు రాకుండా కట్టడి చేయడానికి ఎంత ప్రయత్నించినా సాధ్యపడడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పంట వేసిన రోజు నుంచి కాపాడుకోవటం కోసం ఎంత కృషి చేసినా ఫలితం ఉండటం లేదని రైతులు వాపోతున్నారు. ప్రాణ భయంతో సాయంత్రం అయితే ఇంటికే పరిమితం అవుతున్నామని, ఏనుగులు పంట పొలాలను ధ్వంసం చేసినా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి ఏనుగుల కట్టడికి తగిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.