దంపతుల ఉసురు తీసిన కరెంటు - అనాథలైన పిల్లలు - Wife And Husband Dead - WIFE AND HUSBAND DEAD

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 20, 2024, 11:06 AM IST

Electric Short Circuit Wife And Husband Dead in NTR District : విద్యుదాఘాతానికి గురై దంపతులు మృతి చెందిన సంఘటన ఎన్టీఆర్​ జిల్లాలో చోటుచేసుకుంది. గంపలగూడెం గ్రామంలోని పడమర ఎస్సీ కాలనీలో గోరంట్ల తిరుపతయ్య (62), జమలమ్మ (50) దంపతులు రేకుల ఇంట్లో నివాసం ఉంటున్నారు. ఆదివారం సాయంత్రం (మే 19న) గ్రామంలో గాలులతో కూడిన జల్లులు కురిశాయి.

Gampalagudem NTR District : గాలులతో కూడిన జల్లులు కురిసిన సమయంలో సర్వీసు తీగ నుంచి రేకులకు విద్యుత్తు సరఫరా జరిగింది. ప్రమాదవ శాత్తు వారికి తగలడంతో విద్యుదాఘాతంతో వారిద్దరు మృతి చెందరని స్థానికులు తెలిపారు. గోరంట్ల తిరుపతయ్య, జమలమ్మ కూలి పనులు చేసుకొని జీవించే వారని పేర్కొన్నారు. వీరికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. కళ్లు ఎదుటే తల్లిదండ్రులను కోల్పొయిన ఆ పిల్లలు కన్నీరు మున్నీరు అయ్యారు. ఆ పిల్లలు సముదాయించడం ఎవరి వల్లా కాలేదు. ఈ హృదయ విదారక సంఘటనను చూసి స్థానికులు మనస్సు తరక్కుపోయింది. ఈ నేపథ్యంలో గంపలగూడెం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.