ఓట్లు పండగకు ఆహ్వాన పత్రిక అందిస్తున్న స్వీప్ నోడల్ అధికారి - wedding Style election invitation

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 20, 2024, 10:40 AM IST

Election Invitation in Style Of Wedding Card by Sveep Nodal Officer: ఏలూరు జిల్లా స్వీప్ (Systematic Voter Eduction and Electororal Participation) నోడల్ అధికారి తూతిక శ్రీనివాస్ విశ్వనాథ్ ఓటు హక్కు వినియోగంపై వినూత్న కార్యక్రమం చేపట్టారు. పెళ్లి శుభలేఖ తరహాలో 'అమ్మ పిలుస్తుంది, పండగకు ఆత్మీయ ఆహ్వానం' అంటూ ఎన్నికల ఆహ్వాన పత్రిక (Invitation Card) ముద్రించారు.

Evey One Should Use Vote Right: ఓట్ల పండగకు అర్హులైన ప్రతి ఒక్కరు తప్పకుండా విచ్చేసి తమ అమూల్యమైన ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆహ్వాన పత్రిక ద్వారా ప్రచారం చేపట్టారు. పోలింగ్ తేదీ (Date of polling) 2024 మే 13న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటలకు అని ముద్రించారు. వేదిక తమ సమీప పోలింగ్ కేంద్రం (Polling station) అంటూ కార్డుల ద్వారా ప్రచారం చేస్తున్నట్లు డీపీవో (DPO) వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.