షుగర్‌తో కాలికి తీవ్రగాయం - తప్పని ఎన్నికల విధులు- వీల్ చైర్లోనే ఆర్డీవో ఆఫీస్‌కు వచ్చిన టీచర్ - Election Duty Problems To Teacher - ELECTION DUTY PROBLEMS TO TEACHER
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 25, 2024, 4:51 PM IST
Election Duty Problems To Teacher In Machilipatnam : ఎన్నికల నిర్వహణలో అధికారులు వ్యవహరిస్తున్న తీరు ఉద్యోగులు, ఉపాధ్యాయులను ఇబ్బందులకు గురి చేస్తోంది. మచిలీపట్నం మున్సిపల్ హైస్కూల్లో సునంద కుమారి ఉపాధ్యాయురాలుగా విధులు నిర్వహిస్తున్నారు. షుగర్ వ్యాధి వల్ల సునంద కుమారి కాలికి తీవ్ర గాయం ఏర్పడింది. దీంతో గత నెల రోజులగా ఇంటి వద్దే ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. ఎన్నికల విధులకు హాజరు కావాలంటూ ఆర్టీవో కార్యాలయం నుంచి ఆదేశాలు రావడంతో తాను విధులు నిర్వహించలేని పరిస్థితుల్లో ఉన్నానని అధికారులకు సమాచారం ఇచ్చారు.
అనారోగ్యం పాలైన ఎన్నికల విధులకు తప్పని సరిగా హాజరు కావాలంటూ బందరు ఆర్డీఓ చెప్పడంతో ఎన్నికల విధుల్లో పాల్గొనాలని ఆర్డీవో కార్యాలయం నుంచి సిబ్బంది సునంద కుమారికి ఫోన్లు చేస్తున్నారు. దీంతో సునంద కుమారి తన కుటుంబ సభ్యులతో వీల్ చైర్లోనే ఆర్డీవో కార్యాలయానికి వచ్చి అధికారులకు గోడు విన్నవించుకున్నారు. ఆరోగ్యం సహకరించకపోవడం వల్ల ఎన్నికల విధుల్లో పాల్గొనలేనంటూ అవేదన వ్యక్తం చేస్తున్నారు.