భారీ వర్షాలతో పరవళ్లు తొక్కుతున్న జలపాతాలు - మురిసిపోతున్న ప్రకృతి ప్రేమికులు - GOURIGUNDALA Water FALLS - GOURIGUNDALA WATER FALLS
🎬 Watch Now: Feature Video
Published : Jul 23, 2024, 1:28 PM IST
Eklaspur Waterfalls In Peddapalli District : పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఎక్లాస్‌పూర్‌లోని దట్టమైన అడవిలో ప్రకృతి అందాలు విరజిమ్ముతోంది. గాడిదల గండిగుట్టలోని ఓ జలపాతం చూపరులను కనువిందు చేస్తోంది. చుట్టూ పచ్చదనం పరుచుకున్న అడవి, ఎత్తైన కొండలు, సహజసిద్ధంగా ఏర్పడిన జలసోయగాలు ప్రకృతి ప్రేమికులను స్వాగతం పలుకుతున్నాయి. ఈ జలపాతం సోయగాలను చూసేందుకు వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు తరలివస్తున్నారు. తెల్లటి పాలనురుగులా వచ్చే జల ధారలు పర్యాటకులను కనువిందు చేస్తున్నాయి. జలపాతం వద్ద యువతి, యువకులు కేరింతలు కొడుతూ ప్రకృతిని ఆస్వాదిస్తున్నారు.
Gouri gundala Waterfalls : అటు జిల్లాలోని సబ్బితం గ్రామంలో గౌరీ గుండాల జలపాతానికీ జలకల సంతరించుకుంది. గత వారం రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో గౌరీగుండాల జలపాతం పొంగిపొర్లుతోంది. ఇప్పుడిప్పుడే పర్యాటకులు జలపాత సందర్శనకు వస్తుండటంతో ఆ ప్రాంతంలో సందడి నెలకొంది. ప్రతి సంవత్సరం జలపాతం సందర్శనకు వచ్చిన పర్యాటకులు ప్రాణాలు కోల్పోవడంతో గతేడాది మాదిరిగానే ప్రస్తుతం గౌరీగుండాల జలపాతం సందర్శనను నిషేధించారు.