డంపింగ్ యార్డ్‌లో చెలరేగిన మంటలు - పొగతో తీవ్ర ఇబ్బంది పడిన స్థానికులు - Fire in Dumping Yard - FIRE IN DUMPING YARD
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/29-05-2024/640-480-21586402-thumbnail-16x9-dumping-yard-fire.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 29, 2024, 5:28 PM IST
Dumping Yard Fire in Nidadavolu: తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులోని డంపింగ్ యార్డ్‌లో మంటలు చెలరేగడంతో పలు ప్రాంతాల్లో పొగ కమ్మేసింది. ఆకస్మాత్తుగా చెలరేగిన మంటలు ఎగిసిపడుతూ కార్చిచ్చులా వ్యాపించాయి. మంటలు అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది గంటల తరబడి శ్రమించారు. మంటలు కొంత అదుపులోకి వచ్చినప్పటికీ డంపింగ్ యార్డ్ పక్కనే ఉన్న వైఎస్సార్ కాలనీని పొగ కమ్మేయడంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొన్నారు.
Dumping Yard Fire Smoke Spread: పాలకవర్గం అధికారంలోకి వచ్చిన వెంటనే డంపింగ్ యార్డ్‌ను ఆధునీకరించి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు. హామీ మేరకు శంకుస్థాపన చేశారే తప్ప ఆధునికీకరణ తూతూ మంత్రంగానే కొనసాగిందని స్థానికులు అంటున్నారు. ఒక వైపు ప్రసిద్ధి చెందిన కోట సత్తెమ్మ ఆలయం మరోవైపు వైఎస్ఆర్ కాలనీ ఉన్నప్పటికీ డంపింగ్ యార్డ్ దుస్థితి మాత్రం మారలేదంటున్నారు. పాలక వర్గాల నిర్లక్ష్యానికి డంపింగ్ యార్డ్ పరిస్థితే నిదర్శనంగా నిలుస్తోందని స్థానికులు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి డంపింగ్ యార్డ్‌ను ఆధునీకరించాలని ప్రజలు కోరుతున్నారు.