LIVE Video : తాగిన మత్తులో బీభత్సం సృష్టించిన లారీ డ్రైవర్ - ముగ్గురికి తీవ్ర గాయాలు - Lorry accident CCTV Footage - LORRY ACCIDENT CCTV FOOTAGE
🎬 Watch Now: Feature Video
Published : May 31, 2024, 7:50 PM IST
Drunk lorry driver Hit Many Shops Live Video : పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో రాజీవ్ రహదారిపై ప్రయాణిస్తున్న ఓ లారీ బీభత్సం సృష్టించింది. కరీంనగర్ నుంచి గోదావరిఖని వైపు వెళ్తున్న లారీ డ్రైవర్ అధికంగా మద్యం సేవించి సుల్తానాబాద్ పట్టణంలోకి రాగానే వ్యాపార సముదాయాలపైకి లారీతో దూసుకెళ్లాడు. ఈ ప్రమాదంలో ఐదుగురికి గాయాలు కాగా అందులో ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఒక పానీ పూరి దుకాణం ధ్వంసం అయింది. దీంతో పాటు 10 ద్విచక్ర వాహనాలను లారీ వేగంగా ఢీ కొట్టింది.
Lorry Hit Shops CC Footage : మద్యం మత్తులోనే లారీ డ్రైవర్ డివైడర్ పై నుంచి దూకించి వేగంగా ఓ చెట్టును ఢీ కొట్టడంతో ఆగిపోయింది. లారీ ఒక్కసారిగా అదుపుతప్పి రావడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. లారీ చెట్టును ఢీ కొట్టిన తర్వాత డ్రైవర్‌ను బయటకు తీసుకువచ్చి స్థానికులు దేహశుద్ధి చేశారు. ఈ ఘటనతో రాజీవ్ రహదారికి ఇరువైపులా ట్రాఫిక్‌కి అంతరాయం ఏర్పడింది. వెంటనే ఘటన స్థలానికి పోలీసులు చేరుకొని ట్రాఫిక్ని క్రమబద్ధీకరించారు. అనంతరం లారీని, డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.