డ్రగ్స్ ఒక్కసారి వినియోగిస్తే బానిసలుగా మారే అవకాశం : సందీప్ శాండిల్య - షామీర్పేట డ్రగ్స్‌పై అవగాహన సదస్సు
🎬 Watch Now: Feature Video
Published : Feb 10, 2024, 2:04 PM IST
Drugs Awareness Program in Shamirpet : మత్తు పదార్థాలు ఒక్కసారి వినియోగిస్తే బానిసలుగా మార్చేస్తాయని, వాటికి దూరంగా ఉండాలని మాదకద్రవ్యాల నిరోధక విభాగం డైరెక్టర్ సందీప్ శాండిల్య అన్నారు. హైదరాబాద్ షామీర్‌పేట్‌లోని బిట్స్ పిలానీలో మాదకద్రవ్యాల నిర్మూలనపై నిర్వహించిన ఉన్నత స్థాయి సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ మాదకద్రవ్యాలు విక్రయించే వారితో పాటు, ఉపయోగించే వారి గురించి పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.
రాష్ట్రప్రభుత్వం మాదకద్రవ్యాల రవాణాపై ఉక్కుపాదం మోపిందని, రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలనకు తనిఖీలను ముమ్మరం చేశామన్నారు. మాదకద్రవ్యాలను సరఫరా చేసేవారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కొత్త ఏడాదిలో ఒక్కరు కూడా మాదకద్రవ్యాల బారిన పడకుండా ఉండేందుకు 90 పబ్బులను తనిఖీలు చేశామన్నారు. డ్రగ్స్‌ను నిర్మూలించేందుకు పోలీసులకు సహకరించాలని విద్యార్థులను కోరారు. ఈ సదస్సులో రాచకొండ సీపీ సుధీర్ బాబు యూఎస్ కౌన్సిలేట్ అధికారి ఎర్న్ ఫిషర్, సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతి తదితరులు పాల్గొన్నారు .