వైసీపీలోని రెండు వర్గాల ఘర్షణ- గాజు సీసాలు, రాళ్లు, కట్టెలతో పరస్పర దాడులు - వైసీపీలోని రెండు వర్గాల ఘర్షణ

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 26, 2024, 1:55 PM IST

Drinage Issue YSRCP Leaders Mutual Attacks: గుంటూరు జిల్లాలోని పొన్నూరు పోలీస్​ స్టేషన్​ వద్ద ఉద్రిక్త వాతావరణం(High Tension at Ponnur Police Station) చోటుచేసుకుంది. మురుగు కాలువ పూడ్చివేత విషయంపై గుంటూరులో వైసీపీ(YSRCP)లోని రెండు వర్గాలు బాహాబాహీకి దిగాయి. గాజు సీసాలు, రాళ్లు, కట్టెలతో పరస్పరం దాడులకు తెగబడ్డారు. పొన్నూరు మండలం వడ్డీముక్కలలో రైతులు(Farmers) కొందరు మురుగు కాలువను పూడ్చివేశారు. దీంతో గ్రామ రైతులు రెండు వర్గాలుగా విడిపోయి పొన్నూరు గ్రామీణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదులు చేసుకున్నారు. 

కొంతమంది రైతులు పొన్నూరుకు చెందిన మహ్మద్‌(YSRCP Leader Mohammedను కలవగా, వ్యతిరేక వర్గం వైసీపీ నేత నాజర్(YSRCP Leader Nazar)​ను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఇరువర్గాలు పోలీస్‌ స్టేషన్ వద్దకు చేరుకున్నాయి. దీంతో రెండు వర్గాల మధ్య తోపులాట జరిగి వివాదం పెరిగి పెద్దదైంది. ఈ క్రమంలో విద్యుత్ సరఫరా(Power Supply)ను సైతం నిలిపివేసి రాళ్లు, సీసాలతో దాడులకు పాల్పడ్డారు. దీంతో పోలీసులు ప్రాణభయంతో పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న తెనాలి డీఎస్పీ(Tenali DSP Ramesh) రమేష్ పొన్నూరు పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఇరువర్గాలతో చర్చించటంతో వివాదం సద్దుమణిగింది. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.