జగనన్న భూకబ్జా రివర్స్ మేళా నిర్వహించాలి- ప్రభుత్వానికి డొక్కా మాణిక్య వరప్రసాద్ విజ్ఞప్తి - Dokka Varaprasad On Jagan - DOKKA VARAPRASAD ON JAGAN
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 28, 2024, 2:09 PM IST
Dokka Varaprasad On Jagan : గత ప్రభుత్వంలో జరిగిన భూకబ్జాలను కూటమి ప్రభుత్వం వెలుగులోకి తీసుకురావాలని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ విజ్ఞప్తి చేశారు. ఇటు మాచర్ల జిల్లాలో, అటు మదనపల్లి కలెక్టరేట్ కార్యాలయంలో చూసినా ప్రజలు తమ భూములను ఆక్రమించారని దరఖాస్తులు ఇస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే రాష్ట్రంలో చాలా చోట్ల భూకబ్జాలు జరిగాయని అనిపిస్తోంది. గుంటూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
Dokka on YSRCP Land Irregularities : అందువల్ల ప్రతి నియోజకవర్గంలో జగనన్న భూకబ్జా రివర్స్ మేళా నిర్వహించి బాధితులకు న్యాయం చేయాలని డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. మరోవైపు ఓ పక్క అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సభకు రాకుండా తన క్యాంపు ఆఫీస్లో మీడియా సమావేశం పెట్టడం సరికాదన్నారు. రాజ్యాంగస్ఫూర్తికి ఆయన విఘాతం కలిగించారని విమర్శించారు. శాసనసభ పవిత్రమైనదని చెప్పారు. మీరు సభ్యుడిగా అసెంబ్లీలో మాట్లాడే అధికారం ఉందని, అలా కాకుండా ప్రెస్మీట్ నిర్వహించడం తప్పని జగన్కు డొక్కా మాణిక్య వరప్రసాద్ హితవు పలికారు.