నెల్లూరు వైద్యకళాశాల వద్ద వైద్యురాలి ఆత్మహత్య - Doctor commits suicide
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 1, 2024, 7:56 PM IST
|Updated : Jul 1, 2024, 8:07 PM IST
Doctor suicide in Nellore: నెల్లూరు ప్రభుత్వ వైద్య కళాశాల భవనంపై నుంచి దూకి ఓ వైద్యురాలు ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. నెల్లూరు వైద్య కళాశాలలో జరుగుతున్న క్యాన్సర్ స్క్రీనింగ్ శిక్షణ తరగతులకు జ్యోతి హాజరయ్యారు. ఉదయం తగరతులకు హాజరైన ఆమె, మధ్యాహ్నం ఫోన్ కాల్ రావడంతో మాట్లాడారు. అనంతరం కళాశాల భవనంపైకి వెళ్లి అక్కడి నుంచి కిందకి దూకారు. అపస్మారకస్థితిలో ఉన్న జ్యోతిని ఆసుపత్రికి తరలించగా కాసేపటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
జ్యోతి భర్త రవిబాబు కూడా ప్రభుత్వాసుపత్రిలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. వీరికి రెండేళ్ల పాప ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారిస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. శిక్షణలో ఉన్న డాక్టర్ ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఏమి వచ్చింది, ఫోన్ కాల్ ఎవరు చేశారనే అంశంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. వైద్యురాలు జ్యోతి చేజర్ల మండలం చిత్తలూరు పీహెచ్సీలో సెకండ్ మెడికల్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్నారు.