రోడ్డెక్కిన వైసీపీ కార్పొరేటర్లు- తాగునీటి సమస్య తీర్చాలంటూ అధికారుల ఘెరావ్
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 27, 2024, 1:19 PM IST
Dharna Under YSRCP Corporators on Drinking Water Problem: అనంతపురం నగరపాలక సంస్థ ఎదుట వైసీపీ కార్పొరేటర్ల(YSRCP Corporators) ఆధ్వర్యంలో ప్రజలు ఆందోళనకు దిగారు. తాగునీటి సమస్య(Drinking Water Problem)ను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మహిళలు ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు. తాగునీరు లేక ఇబ్బంది పడుతున్నా అధికారులు పట్టించుకోవట్లేదని నిరసనకారులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు బయటకు వచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళల ఆందోళనలో వైసీపీ కార్పొరేటర్లు హరిత, బాబా పకృద్దీన్తో పాటు ఆ పార్టీ నేత జైరాం నాయుడు పాల్గొన్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి లక్ష్మిప్రసాద్ అందిస్తారు.
"గత కొన్ని నెలల నుంచి అనంతపురంలో తాగునీటి సమస్య ఉంది. దీనిపై మేము చాలాసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదు. అధికారుల నిర్లక్ష్య వైఖరితో మేము ఇప్పుడు రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా అధికారులు దీనిపై స్పందించి తాగు నీటి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నాం." - నిరసనకారులు