సోషల్‌ మీడియాలో బెదిరింపులకు పాల్పడితే కఠిన చర్యలు: డీజీపీ - DGP on Social Media - DGP ON SOCIAL MEDIA

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 3, 2024, 3:39 PM IST

DGP Warned Those who Posts on Social Media: సోషల్ మీడియాలో బెదిరింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా (DGP Harish Kumar Gupta) హెచ్చరించారు. కౌంటింగ్ అనంతరం మీ అంతు చూస్తామంటూ కొంతమంది ప్రత్యర్థులకు సవాలు విసిరి అశాంతిని సృష్టిస్తున్నారని అన్నారు. మరికొందరు సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిగత దూషణలు చేస్తూ ఉద్రిక్తతలు రేపుతున్నారని అన్నారు. శాంతి భద్రతలకు భంగం కలిగించే వారని ఉపేక్షించేది లేదని అన్నారు. మేసేజ్​లు పెట్టి రెచ్చగొట్టే వారిపై ఐటీ యాక్ట్ కేసు నమోదుతో పాటు రౌడీషీట్లు తెరుస్తామన్నారు. అవసరమైతే పీడీ యాక్ట్ సైతం అమలు చేస్తామని హెచ్చరించారు. సామాజిక మాధ్యమాల్లో రెచ్చగొట్టే విధంగా ఫొటోలు, వీడీయోలు షేర్ చేయకూడదని అలాగే వాట్సప్​లో స్టేటస్​గా ఉంచకూడదని హుకుం జారీ చేశారు. గ్రూపు అడ్మిన్లు ఈ తరహా పోస్టింగ్​లను ప్రోత్సహించవద్దని సామాజిక మాధ్యమాల్లో పోస్టింగ్ చేసే వారిపై పోలీసుల నిఘా ఉంటుందని డీజీపీ పత్రికా ప్రకటనలో తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.