తిరుమలకు పోటెత్తిన భక్తులు-కనీస సౌకర్యాల కల్పనలో టీటీడీ విఫలం-భక్తులకు ఇక్కట్లు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 27, 2024, 7:47 PM IST

thumbnail

Devotees Visit Tirumala in Huge Numbers in Tirupathi District : వరుస సెలవులతో తిరుమలకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. వైకుంఠ కాంప్లెక్స్​లు, నారాయణ గిరి షెడ్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి. శుక్రవారం క్యూలైనులోకి వచ్చినా ఇప్పటికీ దర్శనం అవ్వలేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. క్యూలైనులో ఉన్న భక్తులకు పాలు, అల్పాహారం ఇవ్వడం లేదని భక్తులు మండిపడుతున్నారు. వీఐపీ దర్శన ఏర్పాట్లు కారణంగా సామాన్య భక్తులు ఇబ్బందులు పడుతున్నామని పేర్కొన్నారు. తిరుమల దేవస్థానం వీఐపీలకు ఇచ్చిన ప్రాధాన్యత సామాన్య ప్రజలకు ఇవ్వడం లేదని ఆరోపించారు. ఆరోగ్య సమస్యలు ఉన్న భక్తులు క్యూలైన్లు ఇబ్బందులు పడుతున్నామని, తమకు వీలైనంత త్వరగా దర్శనం కలిగించాలని భక్తులు వేడుకుంటున్నారు. 

శ్రీవారి దర్శనం కోసం క్యూలైన్లో 10 గంటలపైనే సమయం పడుతుందని భక్తులకు ఆవేదన వ్యక్తం చేశారు. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలు సమయం పడుతుందని పేర్కొన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 24 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. కనీస సౌకర్యాలు కల్పించడంలో తిరుమల తిరుపతి దేవస్థానం విఫలైమయ్యిందని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.