కావడిలో చిన్నారితో బోల్​ భం యాత్ర - 50 కి.మీ కాలినడకతో మొక్కు చెల్లించుకున్న భక్తుడు - Devotees Rush To Temples AOB

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 12, 2024, 1:43 PM IST

thumbnail
కావడిలో చిన్నారితో బోల్​ భం యాత్ర- 50 కి.మీ కాలినడకతో మొక్కు చెల్లించుకున్న భక్తుడు (ETV Bharat)

Devotees Rush To Temples Andhra Odisha Border : ఆంధ్ర-ఒడిశా సరిహద్దులోని ప్రముఖ శైవక్షేత్రం గుప్తేశ్వరంలో బోల్ భం యాత్రకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఏటా శ్రావణ మాసంలో వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు. కావడి యాత్ర చేసి గంగా జలంతో మహా శివలింగానికి అభిషేకం చేస్తారు. కావడి యాత్ర చేసే భక్తులు దాదాపు 35 కిలోమీటర్ల దూరం కాలినడకన వస్తారు. అయ్యప్ప సేవా పీఠం ఆధ్వర్యంలో అన్నదానం, పాలు, బిస్కెట్ వంటివి పంపిణీ చేశారు. భక్తులకు వివిధ రకాల సేవలు అందిస్తారు. మరికొంతమంది దివ్యాంగ దీక్షదారులు సాష్టాంగ నమస్కారాలు చేస్తూ కావడి యాత్రకు రావడం విశేషం. శివనామస్మరణతో క్షేత్రమంతా మార్మోగింది. 

ఒక తండ్రి తన పది నెలల చిన్నారిని కావడిలో 50కిలోమీటర్లు దూరం నడిచి వెళ్లి మహా శివుడి లింగాన్ని చేరుకున్నారు. కావడికి ఒకవైపు బిందెలో నీళ్లు మరో వైపు శిశువును ఉంచి మోసుకెళ్లి శివలింగానికి అభిషేకం చేశారు. జయపురంలో నివాసం ఉంటున్న శంకర్ కుల్దీప్​ తనకు కొడుకు పుడితే తన బాబుతో వచ్చి మొక్కుంటానని మొక్కుకున్నాడు. ఈ క్రమంలో తన కోరిక నెరవేకడంతో ఆ బిడ్డతో దర్శనానికి వచ్చారు. కావడి వేసుకుని ఆదివారం నాడు పాత్రపుట్ నది నుంచి బయలుదేరి గుప్తేశ్వరం చేరుకున్నాడు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.